Rains In AP: బంగాళాఖాతంలో అల్పపీడనం.. విస్తారంగా వర్షాలు

Byline :  Bharath
Update: 2023-10-21 02:11 GMT

ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తర్వాత మూడురోజులు ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ.. పశ్చమి బెంగాల్ తీరం వైపు కదులుతుందని తెలిపింది. దీని ప్రభావంతో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అలజడిగా ఉంటున్నందున రానున్న మూడు రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. మరోవైపు రెండు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు దక్షిణ కోస్తాంధ్రలో ప్రవేశించేందుకు అనుకూలంగా ఉన్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

మామూలుగా అయితే అక్టోబర్ 18 నుంచి 22 తేదీల మధ్యలో ఈశాన్య రుతుపవనాలు తమిళనాడులోకి ప్రవేశిస్తాయి. తర్వాత దక్షిణ కోస్తాంధ్రలో ప్రభావం చూపిస్తాయి. అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను బట్టి ఈశాన్య రుతుపవనాల ప్రారంభ దశ బలహీనంగా ఉందని తెలుస్తుంది. దీని ఫలితం.. ఏపీలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉండనున్నాయి. కనిష్ఠంగా 21 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠంగా 33 డిగ్రీల సెల్సియస్ ఉండనుంది. అక్కడక్కడ మేఘావృతం అయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News