Sharmila Son Marriage : రాజారెడ్డి- ప్రియా హల్దీ వేడుక.. ఫొటోలు షేర్ చేసిన షర్మిల

Update: 2024-02-17 16:09 GMT

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తన తనయుడు రాజారెడ్డి వివాహ వేడుకల్లో బిజీగా ఉన్నారు. జోథ్‌పూర్‌లో రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహ వేడుక జరగనుంది. తాజాగా షర్మిల కుమారుడు రాజారెడ్డి హల్దీ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షర్మిల షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తన కొడుకు, కోడలి ఫోటోలను షేర్ చేస్తూ కంగ్రాచ్యులేషన్స్ రాజా, ప్రియా అంటూ ఆమె ట్వీట్ చేశారు. తన కొడుకు, కోడలు సంతోషంగా ఉండాలని దీవించారు.

రాజారెడ్డి, ప్రియా అట్లూరి హల్దీ ఫంక్షన్‌ వేడుకల్లో వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల కుమార్తె అంజలి రెడ్డి ఉన్నారు. వైఎస్ విజయమ్మతో పాటుగా ప్రియా రెడ్డి కుటుంబ సభ్యులు కూడా హల్దీ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. జనవరి 18వ తేదిన హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్‌లో రాజారెడ్డి, ప్రియా అట్లూరి నిశ్చితార్థం జరిగింది. వారి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని జోథ్‌పూర్‌లో ఫిబ్రవరి 16 నుంచి 18వ తేది వరకూ మూడు రోజుల పాటు వేడుకగా నిర్వహించనున్నారు. ప్రస్తుతం షర్మిల షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అభిమానులు, కార్యకర్తలు వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. 

Tags:    

Similar News