రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ భార్య మృతి... బాబు అరెస్ట్ వల్ల వార్తయింది...
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై ఆ పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రత సరిగ్గా లేదని, కనీస వసతులు కల్పంచడం లేదని ఆరోపిస్తున్నారు. హైప్రొఫైల్ కేసు కావడంతో జైలు సిబ్బంది హైరానా పడుతున్నారు. ఒత్తిడి తట్టుకోలేక జైలు సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ సెలవులపై వెళ్లారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భార్య కిరణ్మయి మృతిచెందారు. మామూలుగా అయితే ఇది వార్త కాదు. కాకపోతే రాహుల్ జైలు సూపరింటెండెంట్ కావడంతో వార్తయింది.
కిరణ్మయి శుక్రవారం రాత్రి చనిపోయారు. ఆమె నారోగ్యం వల్లే రాహుల్ సైలవుపై వెళ్లారని, ఒత్తిడి లేదని ఎస్పీ జగదీశ్ స్పష్టం చేశారు. కొందరు సోషల్ మీడియాలో తమ జైలు గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాము ఎవరికీ భయపడకుండా తమ విధిని తాము నిర్వర్తిస్తున్నామని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ అన్నారు. విషాదం వల్ల రాహుల్ సెలవులను పొడిగిస్తున్నట్లు తెలిపారు. రాహుల్ తిరిగి విధుల్లో చేరేవరకు తనే జైలు బాధ్యతలు నిర్వహిస్తానన్నారు. జగదీశ్, రవికిరణ్.. రాహుల్ కుటుంబాన్ని పరామర్శించారు.