చంద్రబాబుతో ములాఖత్పై రజినీకాంత్ క్లారిటీ

By :  Krishna
Update: 2023-09-17 08:52 GMT

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఈ నెల 22వరకు ఆయనకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో జైల్లో బాబును పలువురు ప్రముఖులు పరామార్శిస్తున్నారు. కుటుంబసభ్యులు సహా పవన్ కళ్యాణ్ వంటి నేతలు బాబుతో ములాఖత్ అవుతున్నారు. అయితే సూపర్ స్టార్ రజినీ కాంత్ సైతం చంద్రబాబుతో భేటీ అవుతారని వార్తలొచ్చాయి. సెప్టెంబర్ 16న ఆయన బాబును కలుస్తారని ప్రచారం జరిగింది.

ఈ అంశంపై రజినీ కాంత్ క్లారిటీ ఇచ్చారు. ఫ్యామిలీ ఫంక్షన్ వల్ల చంద్రబాబును కలవలేకపోయానని చెప్పారు. ‘‘నేను ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును కలవాల్సి ఉంది. అయితే ఫ్యామిలీ ఫంక్షన్ ఉండడం వల్ల కలవలేకపోయా’’ అని రజినీ తెలిపారు. చంద్రబాబుతో రజినీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఇటీవల జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు రజినీ ముఖ్య అతిథిగా వచ్చారు.

Tags:    

Similar News