‘చంద్రబాబు పోరాట యోధుడు.. ఆయన చేసిన మంచి పనులే రక్ష’:రజనీకాంత్ రియాక్షన్

Byline :  Bharath
Update: 2023-09-13 13:43 GMT

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు రజనీకాంత్ మద్దతునిచ్చారు. ఆయన అరెస్ట్ పై స్పందించిన రజనీ.. నారా లోకేష్ కు ఫోన్ చేసి మాట్లాడారు. చంద్రబాబుకు ఏం జరగదని, కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని చెప్పారు. ‘నా ఆత్మీయ మిత్రుడు గొప్ప పోరాట యోధుడు. చంద్రబాబు అసలు ఎప్పుడూ తప్పు చేయరు. ఆయనపై పెట్టిన అక్రమ కేసులు, అరెస్ట్ లు ఏం చేయలేవు. చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే రక్షగా ఉంటాయి. చేసిన ప్రజాసేవ, మంచి పనులు ఆయనను బయటికి తీసుకొస్తాయి. మీరంతా ధైర్యంగా ఉండాలం’టూ లోకేశ్ తో ఫోన్ లో మాట్లాడారు.

చంద్రబాబు అరెస్ట్ ను పలువురు ప్రముఖులు ఖండించారు. వైసీపీ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ చంద్రబాబుకు అండగా నిలిచారు. సినీ నిర్మాతలు అశ్వినీదత్, డైరెక్టర్ రాఘవేంద్రరావు కూడా మద్దతునిచ్చారు.




Tags:    

Similar News