నారా బ్రాహ్మణికి ఆర్జీవీ సలహా.. అలా చేయొద్దంటూ..

By :  Krishna
Update: 2023-09-29 17:11 GMT

చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా టీడీపీ మోత మోగిద్దాం అనే కార్యక్రమాన్ని తలపెట్టింది. చంద్రబాబుకు మద్దతుగా సెప్టెంబర్ 30న రాత్రి 7 నుండి 7.05 గంటల వరకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించండి అని నారా లోకేష్, నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. ప్రజలు మౌనంగా ఉంటే అన్యాయం చెలరేగిపోతుందని.. చంద్రబాబును అక్రమంగా నిర్బంధించడం తప్పు అని ప్రభుత్వానికి చాటిచెప్పాలని బ్రాహ్మణి పిలుపునిచ్చారు.

నారా బ్రాహ్మణి ట్వీట్పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ‘‘బ్రాహ్మణి.. మీరు ఒక వర్ధమాన రాజకీయవేత్త. మీకు నేను ఓ సలహా ఇస్తున్నాను. మీరు ప్రజలపై ఎంత ప్రభావం చూపగలరు అనే అంశాన్ని టెస్ట్ చేసుకునేందుకు ఇలాంటి ప్రమాదకర ప్రతిపాదనలు చేయొద్దు. మీ ప్రతిపాదనను ఎవరూ పాటించకపోతే మీ రాజకీయ జీవితం షార్ట్ సర్క్యూట్ అవుతుంది. విద్యుత్ శక్తి అనేది ఎప్పుడూ మెరుస్తూ ఉండాలి’’ అని వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.



Tags:    

Similar News