Sharmila : ఖర్గేను కలిసిన వైఎస్ షర్మిల.. కొడుకు పెళ్లి పత్రిక అందజేత..
కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. పార్టీ అగ్రనేతలతో భేటీ అవుతున్నారు. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్గున ఖర్గేతో భేటీ అయిన షర్మిల కొడుకు వివాహ పత్రిక అందజేశారు. పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ భేటీలో మాణిక్కం ఠాగూర్ కూడా పాల్పొన్నారు.
ఉదయం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను సైతం వైఎస్ షర్మిల కలిశారు. కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. ఖర్గేతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల తనకు అప్పగించే బాధ్యతల అంశంపై పార్టీలో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు షర్మిల స్పష్టం చేశారు.
#WATCH | Delhi: Congress leader YS Sharmila says, "I met Congress president Mallikarjun Kharge because I joined the Congress party yesterday. The party is thinking of giving me some responsibilities on which we had a discussion and I said I'm ready to take any responsibility… pic.twitter.com/yGETuYQF1H
— ANI (@ANI) January 5, 2024