ఆంధ్రప్రదేశ్‌లో నిలిచిన రిజిస్ట్రేషన్ సేవలు..ప్రజలు ఇబ్బందులు
ఏపీ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. గత రెండు రోజులుగా సర్వర్లు మొరాయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రిజిస్టర్ ఆఫీసుల వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా లోటు అని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఆధార్ ఈ - కేవైసీలు పని చేయకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల ఆ సేవల కోసం వచ్చిన వారు రిజిస్ట్రేషన్ ఆఫీసుల మందు పడిగాపులు కాస్తున్నారు. భూముల కొనుగోలు, అమ్మకం దారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
చలానా కట్టినా.. సర్వర్ సమస్యతో రిజిస్ట్రేషన్ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ భూములకు ధరలు పెంచొద్దని.. నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.కాగా నిన్న కూడా ఇదే విధంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఉదయం నుంచి ప్రజలు కార్యాలయాల దగ్గర పడిగాపులు కాశారు. సర్వర్ సమస్యలతో.. సాయంత్రం ఆరు గంటల వరకూ ప్రజలు వేచి చూసినా.. రిజిస్ట్రేషన్ కాకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. చాలా మంది ముందుగానే చలానాలు తీసుకున్నామని చెబుతున్నారు. వివిధ సాంకేతిక సమస్యలతో.. రాష్ట్రంలో పలుచోట్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి.