చంద్రబాబు అరెస్ట్.. మేఘాకు రిటైర్డ్ ఐఏఎస్ రమేశ్ రాజీనామా...

Byline :  Lenin
Update: 2023-09-12 08:52 GMT

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీ మేఘా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్‌లో అలజడి రేపింది! మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ బాధ్యతల నుంచి తను తప్పుకుంటున్నట్టు రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ తెలిపారు. తన రాజీనామా లేఖను ఆ సంస్థ ఎండీ కృష్ణారెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. కాగా, తన స్టేట్‍మెంట్ ఆధారంగానే చంద్రబాబుపై కేసు పెట్టారని, అప్రూవర్‌గా మారుతున్నానని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. అది హాస్యాస్పందంగా ఉందని, స్కిల్ డెవలప్‍మెంట్‌లో ఆర్థికశాఖలో అక్రమాలు జరగలేదని అన్నారు. స్కామ్‌లో రమేశ్ పేరు వినిపించడంతో మేఘా కంపెనీ ఆయనతో రాజీనామా చేయించినట్లు వార్తలు వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కంపెనీ వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు పొంది ఉండడంతో ముందు జాగ్రత్తగా రమేశ్‌ను తప్పించినట్లు భావిస్తున్నారు. అయితే అలాందేమ లేదని రమేశ్ అంటున్నారు.

చంద్రబాబు హయాంలో రమేశ్ ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నారు. ప్రభుత్వ సర్వీసుకు రాజీనామా చేసి మేఘాలో చేరిన ఆ కంపెనీ విదేశాల్లో చేపట్టే ప్రాజెక్టులపై అజమాయిషీ చేస్తున్నారు. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ అధికారులు ఆయనను విచారించారు. ఆయన వాంగ్మూలం ఆధారంగానే చందద్రబాబుపై కేసు పెట్టారని వార్తలు వస్తున్నాయి.

Tags:    

Similar News