ఏపీలో రేవంత్ క్రేజ్.. భారీ కటౌట్లతో

Byline :  Bharath
Update: 2023-12-04 10:47 GMT

ఒక్కడే సైన్యంగా మారి పాతాళంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాడు. భారి మెజార్టీతో అధికార బీఆర్ఎస్ పార్టీపై ను ఓడించాడు. మ్యాజిక్ ఫిగర్ దాటి ఏకంగా 64 సీట్లు గెలిచేందుకు కృషిచేశాడు. గ్రూపులు, గొడవలతో ఉన్న పార్టీలో సందికూర్చి, అందరినీ ఒక్కతాటిపై తీసుకొచ్చి.. విజయపథంపై నడిపించాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడుంది.. అనే స్థాయి నుంచి మెజార్టీతో అధికారం చేపట్టేలా చేశాడు. ఆ పేరే అనుముల రేవంత్ రెడ్డి. సొంత పార్టీ నేతలే కాదన్నా.. ప్రత్యర్థి అవమానించినా తట్టుకున్నాడు. ప్రజలు తన పక్షాన ఉన్నారని నమ్మి నిలబడ్డాడు. విజయం సాధించాడు.

సాధారణ ఎమ్మెల్యే స్థాయి నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు. దీంతో రేవంత్ రెడ్డి క్రేజ్ ఒక్కసారిగా దేశమంతా మారుమోగిపోతుంది. ఇటు తెలంగాణలో ఉన్నవారే కాదు.. అటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రేవంత్ రెడ్డి అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇదివరకు రేవంత్ టీడీపీ పార్టీలో పనిచేయడంతోపాటు.. ఆయన అల్లుడిది కూడా ఏపీనే కావడంతో రేవంత్ పై అభిమానం వెల్లువెత్తుతుంది. దీంతో ఏపీ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు. భారీ కటౌట్లు పెట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News