RGV: పవన్‌ కల్యాణ్‌పై ఆర్జీవీ వివాదాస్పద పోస్ట్..

Update: 2023-10-02 05:05 GMT

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫుల్ టైమ్ రాజకీయ విమర్శకుడిగా మారిపోయాడు. చంద్రబాబు నాయుడి అరెస్ట్ తర్వాత జగన్‌కు మద్దతుగా టీడీపీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులపై వెటకారాలతో విరుచుకుపడుతున్నాడు. చివరికి మహిళలని కూడా చూడకుండా నారా బ్రాహ్మణిపైనా సటైర్లు వేస్తున్నారు. చంద్రబాబుకు అండగా నిలబడుతున్న జనసేన నేత పవన్ కల్యాణ్‌పైనా దుమ్మెత్తిపోస్తున్నారు. జగన్ తలచుకుంటే పవన్‌ను తొక్కేస్తాడని ట్వీట్ చేశాడు.

‘‘జగన్మోహన్ రెడ్డి ఆడే ఆటలో కేవలం నువ్వో బంటువి పవన్ కళ్యాణ్, రాజు దాకా అవసరం లేదు ఏనుగులు గుర్రాలతో తొక్కించేస్తాడు నిన్ను’’ అని పోస్ట్ పెట్టాడు. దీనిపై టీడీపీ, జనసేన అభిమానులు విరుచుకుపడుతున్నారు. ‘‘యుద్ధంలో ముందు ఉండి నడిపించేది ఆ భటులు మాత్రమే. భటులు లేకుండ రాజు ఏమీ పీకలేడు కదా’’ అంటున్నారు. ‘‘మధ్యలో నీకు వచ్చిన నొప్పి ఏంటిరా, పీకే బంటు ఐతే మరి నువ్వు పందివి.. జగన్‌కు అమ్ముడుపోయావ్. జగన్ వేసే ఎంగిలి మెతుకులకు అలవాటు పడిన కుక్కవు’’ అంటున్నారు. సినిమాలు లేక వైసీపీ నేతల సాయంతో జగన్ గురించి సినిమాలు తీసుకుంటున్నాడని, జగన్ ఆడే ఆటలో ఆర్జీవీ అరటిపండు అని సటైర్లు వేస్తున్నారు. కొందరు నోటికొచ్చినట్టు బండబూతులు తిడుతూ బూతుల ఫొటోలు పెడుతున్నారు.

Tags:    

Similar News