RGV: నారా బ్రాహ్మణిని వదలిపెట్టని ఆర్జీవీ.. మీ అయ్య నుంచి..

Update: 2023-10-01 04:37 GMT

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సినిమాలు తక్కువ మాటలు ఎక్కువని అందరికీ తెలిసిందే. తన సినిమాలే కాకుండా తన శిష్యుల సినిమాలు కూడా బోల్తా కొడుతుండడంతో ఆయన రాజకీయాలపై దృష్టి సారించారు. టీడీపీ, జనసేన నేతలను టార్గెట్ చేస్తూ జగన్ అనుకూల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. చంద్రబాబు నాయుడి అరెస్ట్ తర్వాత నారా కుటుంబ మహిళలను కూడా వదలకుండా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. లోకేశ్ భార్య, బాలయ్య కూతురు బ్రాహ్మణికి ఉచిత సలహాలు ఇస్తున్న ఆర్జీవి తాజా ఆమె ఈల వేయడంపై స్పందించారు.

చంద్రబాబుకు అరెస్టుకు నిరసనగా టీడీపీ చేపట్టిన ‘మోత మోగిద్దాం’ కార్యక్రమంలో బ్రాహ్మణి విజిల్‌ వేసి, డప్పు కొట్టిన దృశ్యం ఆర్జీవీ కంటపడింది. దీంతో ఆమెను చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తోందని, బాల్యా జ్ఞాపకాలు గుర్తొచ్చాయని ట్వీట్ వదిలాడు. అంతే కాకుండా, అలాగే విజిల్ ఊపడం తన తండ్రి నుంచి నేర్చుకుందేమో అన్నాడు. బాలకృష్ణ ఇటీవల అసెంబ్లీలో విజిల్ వేసిన ఫోటోను కూడా అతికించాడు. ఏపీలో ఐదు కోట్ల మందికి చెవులు బద్దలై ఈఎన్‌టీ ఆస్పత్రులన్నీ నిండిపోయాయన్న వార్త నిజమేనా అని ఎద్దేవా చేశారు. కాగా బ్రాహ్మణి రాజకీయాల్లో ఆచి తూచి అడుగేయాలని ఆర్జీవీ ఇదివరకే సలహా ఇచ్చారు.. ‘‘నువ్వు వర్ధమాన రాజకీయ నాయకురాలివి. మోత మోగిద్దాం వంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. మీ పిలుపు ఎవరూ పాటించకపోతే మీ రాజకీయ జీవితం షార్ట్ సర్క్యూట్ అవుతుంది. విద్యుత్ శక్తి అనేది ఎప్పుడూ మెరుస్తూ ఉండాలి’’ అని అన్నాడు.

Tags:    

Similar News