ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
By : Mic Tv Desk
Update: 2023-07-22 13:36 GMT
ఏపీలో అన్నమయ్య జిల్లాలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . ఆర్టీసీ బస్సు లారీని ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతలందరూ బస్సులో ప్రయాణికులే. తిరుపతి నుంచి కడప వెళ్తున్న ఆర్టీసీ బస్సును పుల్లంపేట సమీపంలోని మలుపు వద్ద సిమెంటు లారీ ఢీ కొట్టింది. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమదానికి కారణమని తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.