కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఆలమూరు మండల పరిధిలోని మడికి జాతీయ రహదారిపై వ్యానును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. మరో 9 మంది గాయపడ్డారు.
అనకాపల్లి సమీపంలోని చోడవరానికి చెందిన 9 మంది టాటా మ్యాజిక్ వ్యాన్‌లో కొత్తపేట మండలం మందపల్లికి దైవదర్శనం కోసం బయలుదేరారు. అదే సమయంలో విశాఖ నుంచి వస్తున్న కారు అదుపుతప్పి వ్యాన్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురితో పాటు కారులో ఉన్న ఒక్కరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో 9 మందిని రాజమహేంద్రవరం హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.