అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోరం జరిగింది. పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు లోయలో పడింది. దాదాపు 100 అడుగుల లోతులో బస్సు పడిపోవడంతో ఇద్దరు చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ బస్సు చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా ఘాట్ రోడ్ వ్యూ పాయింట్ వద్ద ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయాలపాలైన వారందరినీ పాడేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు.