చంద్రబాబు పడేసిన దానికి తృప్తిపడటం.. పవన్‌కు అలవాటైంది : సజ్జల రామకృష్ణారెడ్డి

Byline :  Bharath
Update: 2024-02-24 10:30 GMT

టీడీపీ, జనసేన పొత్తులో బలం కంటే బలహీనతే ఎక్కవ కనిపిస్తుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శనివారం టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సజ్జల.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దయనీయంగా మారారని అన్నారు. చంద్రబాబు ఏది పడేస్తే.. దానికి పవన్ తృప్తి పడడం అలవాటు అయిందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకు గద్దె దించాలో బాబు, పవన్ లకు తెలియడం లేదని అన్నారు. ఈ సీట్ల పంపకం చూస్తుంటే.. పవన్ కు బలం లేదని ఒప్పుకుంటున్నట్లు తేలిందని చెప్పారు. జనసేన పార్టీని చంద్రబాబు మింగాలని చూస్తున్నారు. జనసేన టీడీపీకి అనుబంధ విభాగంగా మారిందని సజ్జల ఆరోపించారు.

పవన్ తన స్థాయిని దిగజార్చుకున్నారు. అభిమానులను, సొంత సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబే డిసైడ్ చేస్తారని చెప్పుకొచ్చారు. బీజేపీతో పొత్తుకు చంద్రబాబు ఆరాటపడుతున్నారు. టీడీపీకి పవన్ ఉపాధ్యక్షుడు అయితే బాగుంటుంది. ముందు 24 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటిచాలని సజ్జల చెప్పుకొచ్చారు. 

Tags:    

Similar News