దారుణం.. ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నాడని.. సర్పంచ్ గృహ నిర్బంధం

Update: 2023-07-07 06:07 GMT

పాలకులను ప్రశ్నించడం, తమ హక్కులను గుర్తు చేస్తూ వాటిని నెరవేర్చాలని కోరడం.. సామాన్యుల పాలిట శాపం అయింది. తమ గ్రామాన్ని అభివృద్ధి చేయలని ప్రశ్నించిన సర్పంచ్ ను గృహ నిర్భందం చేసిన ఘటన.. శ్రీకాకుంలం జిల్లా పాతపట్నం మండలం చిన్నహంసలో చోటు చేసుకుంది. వైకాపా సర్పంచ్ రవికుమార్.. స్థానిక వైకాపా ఎమ్మెల్యే రెడ్డిశాంతి తమ గ్రామానికి వస్తున్నారని తెలిసి గ్రామాభివృద్ధిపై నిలదీయాలనుకున్నాడు. దానికోసం గ్రామస్తులు, కార్యకర్తలను పోగేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. సర్పంచ్ ను గృహ నిర్బంధం చేశారు. దాంతో సర్పంచ్ ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి తన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.




 


‘నా పేరు రవికుమార్. మా ఎమ్మెల్యే రెడ్డిశాంతి అక్రమాలకు పాల్పడి, అభివృద్ధిని మరిచింది. మా మూడు గ్రామాల పరిధిలో రూపాయి అభివృద్ధి కూడా జరుగలేదు. ఎమ్మెల్యే గ్రామానికి వస్తున్న క్రమంలో అడ్డుకుని, నిరసన తెలియజేయాలి అనుకున్నాం. ఈ విషయం పై అధికారులకు తెలిసి నన్ను గృహ నిర్భంధం చేశారు. ఎమ్మెల్యే అక్రమ పాలను మిగతా సర్పంచ్ లు, నాయకులు, గ్రామస్తులు ఖండించాల’ని పిలుపునిచ్చాడు. తర్వాత గ్రామ తహసీల్దారు, ఎస్సై సర్పంచితో మాట్లాడి.. ఎమ్మెల్యేను ప్రశ్నించకుండా ఉండాలని హామీ తీసుకుని కార్యక్రమానికి తీసుకెళ్లారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, వంతెన నిర్మించాలని చాలాకాలంగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు. వరద వస్తే తమకు బయటి ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశాడు. 




 




Tags:    

Similar News