హెలికాఫ్టర్లో జైలుకు చంద్రబాబు.. రాష్ట్రమంతటా 144 సెక్షన్..

By :  Krishna
Update: 2023-09-10 14:20 GMT

టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో నెల 22వరకు ఆయనకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇక చంద్రబాబును రోడ్డు మార్గంలో తీసుకెళ్తే భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో వాయుమార్గంలో తీసుకెళ్లాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు విమానంలో తీసుకెళ్లి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జైలుకు తరలించే అవకాశం ఉంది.

చంద్రబాబుకు రిమాండ్ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో 144 సెక్షన్‌ అమలు చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని హుకుం జారీ చేశారు. మరోవైపు అదే కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం బెయిల్ పిటిషన్పై వాదనలు కొనసాగుతున్నాయి.



Tags:    

Similar News