threat to Sharmila: జగన్‌కు తల్లి, చెల్లి, బాబాయ్ అనే తేడా లేదు.. టీడీపీ నేత
సీఎం జగన్‌కు తల్లి, చెల్లి, బాబాయ్ అనే తేడా లేదన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. షర్మిలను అంతమొందించిన అశ్చర్యపోవాల్సిన పనిలేదని, ఆమెకు భద్రత పెంచాల్సిన అవసరం ఉందంటూ సంచలన కామెంట్స్ చేశారు. మంగళవారం విశాఖపట్నంలోని టీడీపీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన ఆస్తిలో షర్మిలకు వాటా రాశారని, అది జగన్ ఇవ్వట్లేదని చెప్పారు.
వైసీపీ నేతలు భూములు కనిపిస్తే బెదిరించి లాక్కుంటున్నారని అయ్యన ఆరోపించారు. వైసీపీ నేతల అక్రమాలు, దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయిందన్నారు. అధికారంలోకి రాకముందు ఒక్క అవకాశమని చెప్పిన జగన్.. పదవి బాధ్యతలు తీసుకున్నాక ప్రజలను అస్సలు పట్టించుకోలేదని అన్నారు. ఉత్తరాంధ్రకు సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్. భూములను కబ్జా చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. భూములు దోచుకున్న వైసీపీ నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మూడు నెలల తర్వాత అందరి లెక్కలు తీస్తామని, ఎన్నికల తర్వాత జగన్ లండన్, అమెరికాలో దాక్కున్నా లాక్కొచ్చి.. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తామని హెచ్చరించారు.
తనకు కూడా ప్రాణహాని ఉందనీ.. రివాల్వర్ లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. గన్‌మెన్ ఇస్తామని ఎస్పీ చెప్పారనీ.. కానీ నిరాకరించినట్లు తెలిపారు. తానెక్కడున్నానో గన్‌మెన్‌లు సమాచారం ఇచ్చే అవకాశాలు ఉన్నందుకే గన్‌మెన్లను వద్దని చెప్పానన్నారు.