Jagan : శారదా పీఠం వార్షికోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం

Update: 2024-02-06 04:53 GMT

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విశాఖ శారదా పీఠం ఉత్తరాదికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలని సీఎం జగన్‌కు ఆహ్వానం అందించారు. విశాఖ పట్నంలో చిన ముషిడివాడలో శ్రీ శారద పీఠం వార్షికోత్సవాలు ఈ నెల 15 నుంచి 19 వరుకు జరుపనున్నారు. ఫిబ్రవరి 15న చండీయాగంతో శారద పీఠం వార్షికోత్సవాలు ప్రారంభం కానున్నాయి.చివరగా ఫిబ్రవరి 19న రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. సీఎం జగన్ కు శాలువా కప్పి సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శారదా పీఠం వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. కాగా, సీఎం జగన్ వార్షికోత్సవాల చివరి రోజున విశాఖ శారదా పీఠానికి వచ్చి రాజశ్యామల యాగంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఏటా మాఘ మాసం పంచమి నుంచి దశమి వరకు శ్రీ శారదా పీఠం (Sri Sarada Peetham) వార్షికోత్సవాలు జరుగుతాయి. దేశ రక్షణ కోసం 5 రోజుల పాటు శారదా పీఠం రాజ్యశ్యామల అమ్మవారి యాగం నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఇదే ఏడాది ఫిబ్రవరిలో కూడా ఈ యాగాన్ని నిర్వహించారు. విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామితో సీఎం జగన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగా పీఠంలో జరిగే కార్యక్రమాలకు జగన్ ప్రత్యేకంగా హాజరవుతూ ఉంటారు. పీఠంతో ప్రత్యేకమైన అనుబంధం సీఎంకు ఉన్నందున ఆయను మాత్రమే వీఐపీని ఆహ్వానిచామని శారదాపీఠాధిపతి వారు తెలిపారు. 



 


Tags:    

Similar News