బీరు సీసాలతో సాయిబాబాకు అభిషేకం..భక్తుల ఆగ్రహం

Update: 2023-07-04 06:04 GMT

దేవుడి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేయడం సంప్రదాయం. పాలు, తేనె, పంచదార, పండ్ల రసాలను ప్రత్యేక పాత్రల్లో తీసుకుని పంచామృతాన్ని తయారు చేసి దేవిడికి అభిషేకం చేస్తుంటారు భక్తులు . కానీ పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం అందుకు విరుద్ధంగా ఓ గ్రామస్థులు వ్యవహరించారు. గురుపౌర్ణమి రోజున బీరు బాటిళ్లతో తేనె పాలను తీసుకువచ్చి బాబాకు అభిషేకం చేశారు. దీంతో ఈ సంఘటనపై బాబా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురు పౌర్ణమి నాడు బాబాను అవమానించారంటూ మండిపడుతున్నారు.




 


పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరంలోని కొంత మంది భక్తులు బీరు బాటిళ్లతో, వైన్ సీసాలతో బాబాకు అభిషేకం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాయి బాబా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మిగతా గ్రామస్థలు బాబాకు ప్రత్యేక పూజలు చేస్తుండగా , కొంత మంది




 


బీరు సీసాలు, విస్కీ బాటిల్స్ లో తేనే ఇతర ద్రవ్యాలతో బాబా విగ్రహానికి అభిషేకం చేశారు. లిక్కర్ బాటిళ్లతో అభిషేకం చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పాత్రల్లో అభిషేకం చేయకుండా ఆల్కాహాల్ సీసాల్లో చేయడం చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఈ కొత్తరకం సంప్రదాయం ఏంటని బాబా భక్తులు మండిపడుతున్నారు. ఇలా చేయడం దేవుడిని అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




 



Tags:    

Similar News