సింహాచలంలో గిరిప్రదక్షిణ.. లక్షల్లో భక్తులు

Update: 2023-07-02 09:59 GMT

విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2.30గంటలకు తొలి పావంచా వద్ద విశాఖ నగర పోలీసు కమిషనర్‌ త్రివిక్రమ వర్మ, సింహాచలం దేవస్థానం ఈవో త్రినాథరావు జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. గిరిప్రదక్షిణలో పాల్గొనేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. అడవివరం, హనుమంతవాకా, అప్పుఘర్‌ మార్గంలో భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు.




 


సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్ల గిరిప్రదక్షిణకు వచ్చే భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.ప్రతి అర కిలోమీటర్‌కు ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటుచేసి విశ్రాంతి తీసుకునేందుకు కుర్చీలు, టేబుళ్లు ఏర్పాటుచేశారు. కొండ చుట్టూ సుమారు 200 తాత్కాలిక మరుగుదొడ్లు, వాటికి నిరంతరం నీరు అందేలా ట్యాంకర్లను అందుబాటులో ఉంచారు. గిరిప్రదక్షిణ చేస్తూ అనారోగ్యానికి గురైన భక్తుల కోసం ఎక్కడికక్కడ అంబులెన్స్‌లు, వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం, మజ్జిగ అందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా తమ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాయి. . గిరిప్రదక్షిణ చేసి వచ్చే భక్తులు సింహగిరి చేరుకునేందుకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. 




 


Tags:    

Similar News