బీజేపీ టికెట్లకు ముగిసిన గడువు ... ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే

By :  Lenin
Update: 2023-09-10 14:08 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయడానికి ఆశావహులు పోటెత్తారు. ఎమ్మెల్యే టికెట్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆదివారంతో గడువు ముగిసింది. చివరి రోజు ఏకంగా 2,781 మంది దరఖాస్తు చేసుకున్నారు. 119 అసెంబ్లీ స్థానాలకుగాను ఈ నెల 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా గడుపు ముగిసే సమయానికి మొత్తం 6,003 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో స్థానానికి సగటున 50 దరఖాస్తులు వచ్చినట్లు లెక్క.

దరఖాస్తు చేసినవారిలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు సహా పలువురు రాష్ట్ర నేతలు ఉన్నారు. బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి(ముషీరాబాద్), యడ్ల సతీశ్ కుమార్(పాలకుర్తి), హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి(సికింద్రాబాద్) తదితరులు కూడా టికెట్లకు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించడం తెలిసిందే. వెయ్యికిపైగా దరఖాస్తులు రాగా వడపోత కసరత్తు సాగుతోంది. ఈ నెలలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ 4 స్థానాలకు మినహా మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్థులు ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండడంతో విపక్షాలు టికెట్ల పంచాయతీని త్వరగా ముగించాయలని కసరత్తు చేస్తున్నాయి.


Tags:    

Similar News