Tirumala: తిరుమలలో భారీ కొండ చిలువ.. భయంతో పరుగులు తీసిన జనం..

By :  Kiran
Update: 2023-09-30 05:37 GMT

తిరుమలలో భారీ కొండచిలువ జనాన్ని భయభ్రాంతులకు గురి చేసింది. స్థానిక బాలాజీ నగర్ లోని ఇంటి నెంబర్ 816 వద్ద 13 అడుగుల కొండ చిలువ ప్రత్యక్షమైంది. అది చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చారు. టీటీడీకి చెందిన స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఆ భారీ కొండచిలువను పట్టుకుని అవ్వాచారి కోనలో వదిలిపెట్టారు. కొండచిలువను పట్టుకునేందుకు ఆయన తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

తిరుమలలో అప్పుడప్పుడు కొండచిలువలు కనిపిస్తుంటాయి. కానీ ఇంత భారీ సైజులో ఉన్న కొండచిలువను చూడటం అరుదని స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు చెప్పారు. తిరుమలలో భారీ వర్షం కురుస్తుండటంతో పాములు బయటకు వస్తున్నాయని అన్నారు. భారీ వాన పడ్డప్పుడల్లా వన్యప్రాణులు, పాముల బెడద కొనసాగుతోందని తిరుమలవాసులు వాపోతున్నారు.


Tags:    

Similar News