శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. జనసేన కార్యకర్తను సీఐ అంజు యాదవ్ చెంప దెబ్బ కొట్టారు. సీఎం దిష్టిబొమ్మ దహనానికి జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి శ్రీకాళహస్తి పెళ్లి మండపం వద్ద ఆందోళన చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు, జనసేన కార్యకర్తలకు మధ్య తోపులాట, వాగ్వాదం కూడా జరిగింది. ఈ క్రమంలో వన్ టౌన్ పీఎస్ ముందు జనసేన కార్యకర్త చెంప చెల్లుమనిపించారు సీఐ అంజు యాదవ్. దీంతో పోలీసుల రౌడీయిజం నషించాలని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఐ తీరుపై జనసేన కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న మమ్మల్ని సీఐ కావాలనే కొట్టారని వారు ఆరోపిస్తున్నారు.