Supreme Court : చంద్రబాబు బెయిల్ రద్దు పటిషన్పై సుప్రీంలో విచారణ
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఈ తీర్పును సీఐడీ సుప్రీంలో సవాల్ చేసింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ తమ పిటిషన్‌లో తెలిపింది. అదేవిధంగా ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందన్న అంశాన్ని కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని తెలిపింది. వెంటనే చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని సీఐడీ కోరింది.
సీఐడీ పిటిషన్పై సుప్రీం ఇవాళ విచారణ చేపట్టింది. కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. దీంతో బాబుకు కాస్త ఊరట లభించింది. అయితే కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ చంద్రబాబు బెయిల్ రద్దు చేస్తే ఎన్నికల సమయంలో టీడీపీ పరిస్థితి ఏందనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఈ కేసులో బాబు 50రోజులకు పైగా జైల్లో ఉన్నారు. ఈ కేసులో ముందుగా ఆయనకు మధ్యంతర బెయిల్ రాగా.. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చింది.