IAS Officer SriLakshmi : ఐఏఎస్ శ్రీలక్ష్మిని వదలని ఓబులాపురం.. సుప్రీం నుంచి

Update: 2023-08-25 12:21 GMT

ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఓబులాపురం గనుల కుంభకోణం వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో సుప్రీం కోర్టు ఆమెకు తాఖీదులు జారీ చేసింది. దీంతో కేసు మరో మలుపు తిరిగే అవకాశముంది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిపై అభియోగాలను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేయడం తెలిసిందే. దర్యాప్తు సంస్థ వినతిని పరిశీలించిన జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్‌ల బెంచ్ శ్రీలక్ష్మికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి పనిచేసిన శ్రీలక్ష్మి.. వైఎస్ సన్నిహితుడైన గాలి జనార్దన్ రెడ్డికి అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీకి అడ్డగోలుగా లీజులు కట్టబెట్టి, కోట్ల లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆమె జైలుకు కూడా వెళ్లారు. సీబీఐ కోర్టు ఆమెను దోషింగా తేల్చగా తెలంగాణ హైకోర్టు ఊరట కల్పిస్తూ కేసులను కొట్టేసింది. దీంతో సీబీఐ సుప్రీం కోర్టుకు వెళ్లింది. శ్రీలక్ష్మి మైనింగ్ కేసులోనే కాకుండా సీఎం జగన్ అక్రమాస్తుల కేసులోనూ నిందితురాలే. కేసుల్లో చిక్కుకోవడం, జైలు వెళ్లడం వంటి పరిణామాల నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఆమెకు ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి పోస్టు అప్పగించింది.

Tags:    

Similar News