Chandrababu: ఫైబర్ నెట్, క్వాష్ పిటిషన్ కేసులపై సుప్రీం తీర్పు..!

By :  Bharath
Update: 2023-10-13 11:16 GMT

చంద్రబాబుకు సంబంధించిన కేసుల్లో.. ప్రతీది వాయిదా పడుతూనే వస్తుంది. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దానిపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా వేసింది. మంగళవారం (అక్టోబర్ 17) మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపడతామని సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు వెల్లడించారు. ఇవాళ సీఐడీ తరఫున లాయర్ ముకుల్ రోహత్గా వాదనలు వినిపిస్తూ.. నేరం ఐదేళ్ల కిందట జరిగినా ఎఫ్ఐఆర్ ఇప్పుడు నమోదు చేయొచ్చని చెప్పుకొచ్చారు. 17ఏ అనేది అవినీతికి రక్షణ కాకూడదని వివరించారు.

ఫైబర్ నెట్ కేసు విచారణ వాయిదా:

అందేకాకుండా ఫైబర్ నెట్ కేసుపై విచారణ కూడా సుప్రీం కోర్ట్ వాయిదా వేసింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. దానిపై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను మంగళవారం (అక్టోబర్) కొనసాగిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ క్రమంలో ప్రతివాదులకు నోటీసులు కూడా జారీ చేసింది. కాగా, ఈ కేసులోనూ 17ఏను పరిగణనలోకి తీసుకోలేదని చంద్రబాబు తరుపు న్యాయవాది లూథ్రా వాదించారు. ఫైబర్ నెట్ కేసులో ముగ్గురికి ముందస్తు బెయిల్, ఇద్దరికి రెగ్యులర్ బెయిల్ వచ్చినప్పుడు చంద్రబాబుకు ఎందుకు బెయిల్ ఇవ్వట్లేదని ప్రశ్నించారు.


Tags:    

Similar News