జగన్తో కలిసి పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడనందుకు సంతోషం : TDP

Byline :  Krishna
Update: 2024-01-06 11:02 GMT

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీని వీడడం చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీలో చేరి 10 రోజులు కూడా కాకముందే రాజీనామా చేయడంపై రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది. వైసీపీ వంటి పార్టీలో ఇమడలేక రాజీనామా చేశారని కొందు అంటుంటే.. ఎంపీ టికెట్ కన్ఫార్మ్ కాకపోవడంతోనే రిజైన్ చేశారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాయుడు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ స్పందించింది. జగన్ లాంటి దుర్మార్గుడితో కలిసి పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడనందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేసింది. రాయుడు భవిష్యత్తు మంచిగుండాలని ఆకాంక్షించింది. టీడీపీ ట్వీట్పై పలువురు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

కాగా డిసెంబర్ 28న అంబటి రాయుడు వైసీపీలో చేరారు. సీఎం జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే 10 రోజులు కూడా కాకముందే వైసీపీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘‘రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా’’ అని రాయుడు పోస్ట్ చేశారు.

Tags:    

Similar News