ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన చంద్రబాబు

Update: 2023-08-17 13:01 GMT

వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ..వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. వరుస కార్యక్రమాలు చేపట్టి ప్రజలతో మమేకమవుతున్నారు. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొత్త పేట నియోజకవర్గం ’భవిష్యత్ గ్యారంటీ‘ ప్రచారం నిర్వహించారు.

ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఆలమూరు గ్రామంలో ఆర్టీసీ బస్సు ఎక్కిన చంద్రబాబు..మహిళా ప్రయాణికుల పక్కన కూర్చొని వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. ఇందులో భాగంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, ప్రభుత్వ పన్నులపై మహిళలు తమ అవేదన వ్యక్తం చేశారు.

కరెంటు బిల్లులు కూడా వేలల్లో వస్తున్నాయని చెప్పారు. టీడీపీ గతంలో ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీపై వీరు హర్షం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రకటించిన మహా శక్తి పథకం లబ్ధి గురించి చంద్రబాబు నాయుడు మహిళలకు వివరించారు టీడీపీ అధికారంలోకి వస్తే ఆరు పథకాల్ని కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు.

tdp cheif chandrababu today traveled in apsrtc bus in alamuru

tdp cheif chandrababu, traveled , apsrtc bus, alamuru

Tags:    

Similar News