ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకు అణిచివేస్తున్నారు - చంద్రబాబు

Byline :  Kiran
Update: 2023-09-09 03:38 GMT

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో పోలీసులు అరెస్టు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. ఆధారాలు చూపమని అడిగినా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకే తనను అణిచివేస్తున్నారని మండిపడ్డారు. ఏం తప్పు చేశానో చెప్పకుండా అరెస్ట్ చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయమే గెలుస్తుందని అన్నారు.

ఉదయం 5గంటల సమయంలో నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు రోడ్డు మార్గంలో విజయవాడ తరలిస్తున్నారు. ఆయనను సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. చంద్రబాబు అరెస్టుకు ముందు ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద హై డ్రామా నెలకొంది. పోలీసులు పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్టుతో నంద్యాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆందోళనకు దిగారు.

Tags:    

Similar News