టీడీపీ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం జరిగింది. అయితే తృటిలో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. అద్దంకి తెదేపా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. రవి కుమార్ ఏపీ నుంచి హైదరాబాద్ వస్తుండగా.. సూర్యాపేట కారు బోల్తా పడింది. సమయానికి కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. ప్రాథమిక చికిత్స తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్లారు. తాను క్షేమంగా ఉన్నానని కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే చెప్పారు