పై ఫొటోలో ఉన్న నేత ఎవరో గుర్తుపట్టారా? రాజుల కుటుంబంలో పుట్టిన, రాజకీయాల్లో వివిధ హోదాలు అనుభవించిన ఏమాత్రం గర్వం లేకుండా సామాన్యులతో కలిసిపోయే నేత ఆయన. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడుగా, కేంద్ర మాజీమంత్రిగా వివిధ హోదాల్లో ఉన్నఏనాడు ఆయన ఆ డాబును ప్రదర్శించలేదు
తాజాగా మహారాష్ట్ర వెళ్లేందుకు రాత్రి హైదరాబాద్ రైల్వేస్టేషన్ కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన అశోక్ గజపతిరాజు. ఇలా సామాన్యుడిలా రైలు కోసం ప్లాట్ ఫారంపై ఎదురు చూస్తూ కనిపించారు. ప్రస్తుతం విజయనగరంలోని గణపతుల బంగ్లాలో నివాసం ఉంటున్నా అశోక్ గజపతిరాజు నిత్యం ప్రజలతో మమేకమై తిరుగుతుంటారు. తాజాగా ఆయన రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తున్న చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.