పూనమ్ పాండే ఇప్పుడు చేసింది.. కానీ జగన్ ఎప్పుడో చేసిండు : TDP
దేశవ్యాప్తంగా బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే చేసిన పని చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా మొత్తం ఆమె పోస్టులతోనే నిండిపోయింది. పూనమ్ సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయిందని.. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచే రావడంతో నిజమేనని నమ్మారంతా. అంతా అయిపోయిందనుకున్న టైంలో.. చావు కబురు చల్లగా చెప్పినట్లు.. ‘నేను బతికే ఉన్నాను’ అంటూ స్వయంగా పూనమ్ పాండేనే ఓ వీడియో రిలీజ్ చేసింది. దీంతో అంతా అవాక్కయ్యారు. సర్వైకల్ క్యాన్సర్పై అవగాహన కోసమే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చింది.
పూనమ్ పాండే అంశంపై టీడీపీ స్పందించింది. పూనమ్ చేసిన పనిని జగన్ ఘటనతో పోలుస్తూ సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘‘ఈ ట్రిక్ పూనమ్ పాండే ఇప్పుడు చేసింది. కానీ కోడి కత్తి పేరుతో జగన్ ఎప్పుడో చేశాడు’’ అని ట్వీట్ చేసింది. దీనికి ఆ ఘటన సమయంలో జగన్ గాయపడ్డ ఫొటోను జత చేసింది. ఇక ఈ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. టీడీపీ తీరుపై వైసీపీ అభిమానులు ఫైర్ అవుతోన్నారు. జగన్ కు డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదని.. చంద్రబాబే వెన్నుపోటు పొడిచారంటూ ఆరోపిస్తున్నారు.
Jagan did the Poonam Pandey trick long ago with the Kodi Kathi attack bro! 😂#DoitLikePoonamPandey pic.twitter.com/xGX0Z0e81X
— Telugu Desam Party (@JaiTDP) February 3, 2024