Teacher salary delay in ap : ఏపీలో టీచర్లకు వేతనాలు ఆలస్యం.. ఎందుకంటే?

Byline :  Bharath
Update: 2023-09-05 10:32 GMT

విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ కన్వెన్షన్‌ హాల్‌లో టీచర్స్ డే వేడుకలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి బొత్ససత్యనారాయణ హాజరయ్యారు. గురుపూజోత్సవం కార్యక్రమం సందర్భంగా బెస్ట్ టీచర్లకు మంత్రి పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గుడివాడ అమర్‎నాథ్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడులు పాల్గొన్నారు. ఈ వేదికపైనే మంత్రి బొత్స టీచర్ల వేతనాలు ఆలస్యం అవడం గురించి క్లారిటీ ఇచ్చారు.

ఉపాధ్యాయుల వేతనాల గురించి విమర్శిస్తున్నవారిపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు.

మంత్రి బొత్స మాట్లాడుతూ.." టెక్కికల్ సమస్యల కారణంగానే టీచర్లకు వేతనాలు ఆలస్యం అయ్యాయి. ఈ నెల 7 లేదా 8వ తారఖీలు కల్లా టీచర్ల అకౌంట్లలో వేతనాలు జమ అవుతాయి. ఈ విషయంలో టీచర్లకు టెన్షన్ వద్దు. ఏపీలో ఏళ్లుగా యూనివర్శిటీలలో నియామకాలు లేవు. గత ప్రభుత్వాలు ఈ విషయం గురించి ఆలోచించలేదు. ఈ నియామకాల గురించి ముఖ్యమంత్రి జగన్‌ ఆలోచన చేస్తున్నారు. 3,200 పోస్టుల భర్తీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. నెల రోజుల్లో అన్ని వర్సిటీల్లో పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటాం. గవర్నమెంట్ స్కూల్స్ ముందు నో సీట్ బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం 10వ తరగతి రిజల్ట్స్‎లో సర్కారీ బడుల్లో చదివిని విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు. రాష్ట్రంలో అమలు చేసిన విద్యా సంస్కరణలను పరిశీలించాలని నీతి ఆయోగ్ కూడా చెబుతోంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ పుస్తకాలను ప్రశంసించారు’’ అని బొత్స వెల్లడించారు.

Tags:    

Similar News