టీటీడీ ప్రతిపాదనను జగన్ ప్రభుత్వం తిరస్కరించింది. తిరుపతి అభివృద్ధికి బడ్జెట్‌లో ఒకశాతం నిధి కేటాయించాలని టీటీడీ పాలక మండలి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు టీటీడీ ఈవోకు దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ మెమో ఇచ్చారు. ఇటీవల జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో తిరుపతి నగర అభివృద్ధి కోసం వార్షిక బడ్జెట్‌లో ఒకశాతం కేటాయించి ఓ ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనిపై హిందూ సంఘాలు సహా రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వం టీటీడీ ఈవోను ఆదేశించింది.