AP Elections : ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన.. ఎన్నికల నిర్వహణపై చర్చ

Byline :  Krishna
Update: 2024-01-09 04:11 GMT

ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటిస్తోంది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించనుంది. ఎన్నికలపై రాజకీయ పార్టీలు, రాష్ట్ర అధికారులతో చర్చించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానుంది. ఎన్నికల నిర్వహణపై వారి అభిప్రాయాలు, సూచనలను తీసుకోనుంది. మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించనుంది.

అదేవిధంగా బుధవారం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వివిధ ఏజెన్సీలతో ఎలక్షన్ కమిషన్ భేటీ అవుతుందని చెప్పారు. అదేవిధంగా సీఎస్, డీజీపీలతో సమావేశమై కీలక సూచనలు ఇస్తుందని తెలిపారు. మరికొన్ని నెలల్లో ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తోంది.

Tags:    

Similar News