AP Assembly Meeting : జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన గవర్నర్

Update: 2024-02-05 06:52 GMT

ఏపీలో ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించారు. జగన్ ప్రభుత్వం ఇప్పటివరకూ నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టిందని అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించామని తెలిపారు. అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు అభినందనీయమని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. జగన్‌ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్నామని..నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేసిందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. పేద పిల్లలకు గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అందిస్తున్నామని అన్నారు. అయితే గవర్నర్ ప్రసంగం అడ్డుకునేందుకు ప్రయత్నించారు టీడీపీ సభ్యులు. గవర్నర్ ప్రసంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags:    

Similar News