వైకాపా నేతలకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు

Byline :  Aruna
Update: 2023-09-13 03:37 GMT

స్పెషల్ స్టేటస్‎ను డిమాండ్ చేస్తూ 2015లో అప్పట్లో వైకాపా నేతలు ఏపీలో బంద్‎కు పిలుపునిచ్చారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున నేతలు ఆందోళన చేపట్టారు. నిరసనల నేపథ్యంలో స్థానిక కృష్ణలంక పోలీస్ స్టేషన్‎లో 55 మందికిపైగా వైకాపా నేతలపై 341, 188, 290 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల విచారణ ప్రస్తుతం విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానంలో కొనసాగుతోంది. ఈ కేసులో ఏ1గా పార్థసారథి, ఏ2గా కొడాలి నాని, ఏ3గా వంగవీటి రాధాల పేర్లు ఉన్నాయి. వీరితో పాటు మరో 52 మందిపై కూడా పోలీస్ స్టేషన్‎లో కేసులు నమోదు చేశారు. తాజాగా మంగళవారం జరిగిన విచారణకు హాజరవకపోవడంతో స్పెషల్ కోర్టు న్యాయాధికారి గాయత్రీదేవి..పార్థసారథి, కొడాలి నానితో సహా వంగవీటి రాధాకు నాన్‌-బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేశారు.



Tags:    

Similar News