నారా భువనేశ్వరి తప్పిన పెను ప్రమాదం

Update: 2024-01-30 09:36 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం భువనేశ్వరి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తంది. దీంతో గన్నవరం ఎయిర్ ఫోర్టు నుంచి టీకాఫ్ అయిన ఫ్లైట్ అక్కడక్కడ చక్కర్లు కొట్టింది. విమానం వీల్ తెరుచుకోకపోవడంతో ఈ ఘటన జరిందని అనంతరం సేఫ్‌గా విమానాన్ని ఈ ఘటన గన్నవరం ఎయిర్ ఫోర్టులో ల్యాండ్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భువనేశ్వరికి గన్నవరం ఎయిర్ పోర్టులో మాజీ మంత్రి దేవినేని ఉమా తదితరులు స్వాగతం పలికారు. నారా భువనేశ్వరి నేడు రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయిన అనంతరం మరణించిన టీడీపీ కార్యకర్తలను కుటుంబాలను పరామర్శించి, వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్థాపానికి గురై చనిపోయిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పర్యటించిన భువనేశ్వరి.. బాధితులను పరామర్శిస్తూ.. ఆర్థిక సహాయం అందజేస్తూ.. టీడీపీ అండగా ఉంటుందంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

Tags:    

Similar News