YCP Rajya Sabha candidates : వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే..

Update: 2024-02-08 08:24 GMT

వైఎస్సార్‌సీపీ ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. రాజ్యసభ బరిలో వైవీ సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడా రఘునాథ రెడ్డి పేర్లను ఖరారు చేశారు.వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డి ఎన్నికల్లో పోటీలో ఉండనున్నారు. ఇక, నేటి నుంచి ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు 27న పోలింగ్‌ జరుగనుంది. కాగా ఎమ్మెల్యేల కోటాలో ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహించారు. సీఎం రమేశ్‌తో పాటు కనమేడల రవీంద్రకుమార్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఎంపీలుగా కొనసాగాయి. తాజాగా వీరి పదవీకాలం ముగిసింది. దీంతో ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు ఓటింగ్ ద్వారా రాజ్యసభ సభ్యుడిని ఎన్నుకోనున్నారు. అటు తెలుగు దేశం పార్టీ నేతలు సైతం అభ్యర్థులను బరిలో దించనున్నారు. తాజాగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని ఆమోదించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేల బలం తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ నిర్ణయంపై ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మూడు స్థానాల కోసం రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా.. కావాల్సిన సంఖ్య కంటే వైసీపీకి ఎక్కువ ఎమ్మెల్యేల బలం ఉంది.. ఇదే సమయంలో.. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో ముఖ్య నేతలు పడిపోయారు.. 132 మంది ఎమ్మెల్యేల బలంతో మూడు రాజ్యసభ స్థానాలు తేలిగ్గా కైవసం చేసుకునే అవకాశం ఉంది.. అయితే, గత ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. అసంతృప్తలపై వైసీపీ అధిష్టానం ఫోకస్‌ పెట్టిందట.. ఇప్పటికే మార్పులు, చేర్పులతో కొంత మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. మరికొందరు పార్టీకి రాజీనామా చేశారు.. ఈ నేపథ్యంలో. అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News