వైఎస్ సునీతకు బెదిరింపు కాల్స్.. పోలీసులకు ఫిర్యాదు

Update: 2024-02-02 11:03 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) డాక్టర్ సునీత రెడ్డి ప్రాణహాని ఉందని సైబరాబాద్ సైబర్ క్త్రెమ్ డీసీపీ శిల్పవల్లికి ఫిర్యాదు చేశారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలిపింది. తనను చంపుతామంటూ ఫేస్ బుక్ (Facebook) వేదికగా బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కోన్నారు. తనపై బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి (DCP Shilpavalli) మాట్లాడుతూ, సునీత తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా ఫిర్యాదు చేశారని చెప్పారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని డీసీపీ వెల్లడించారు. సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరగా.. త్వరలోనే వైఎస్ సునీత (YS Sunitha)కూడా హస్తం పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.

ఏపీసీసీ చీఫ్‌గా ఉన్న షర్మిలను ఇటీవలే సునీత కలిశారు. ఇడుపులపాయలోని ఎస్టేట్‌లో దాదాపు రెండు గంటల పాటు వీరిద్దరు చర్చలు జరిపారు. ఈ భేటీలో వైఎస్ వివేకా హత్య కేసుతో పాటు ఏపీ రాజకీయాలపైనా చర్చించినట్లు సమాచారం. ఆమె కాంగ్రెస్ పార్టీ (Congress party) లో చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. సునీత కలవడం ఇదే తొలిసారి. వైఎస్ వివేకానంద రెడ్డి మార్చి 15, 2019న పులివెందులలో తన నివాసంలో శవమై కనిపించారు. ఆయన నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి దారుణంగా హత్య చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ (AP) అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన హత్యకు గురయ్యారు. దీనిపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది. దీనిపై పలువురు అనుమానితులను అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News