శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపు ఏప్రిల్ నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Byline :  Kiran
Update: 2024-01-17 13:14 GMT

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదలచేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన తదితర ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం గురువారం నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రకటించింది. జనవరి 18 ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని చెప్పింది లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు జనవరి 22 మధ్యాహ్నం 12 గంటల్లోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది.

శ్రీవారి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను జనవరి 22 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లను జనవరి 22 మ‌ధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ 21 నుంచి 23 వరకు శ్రీవారి వార్షిక వసంతోత్సవం జరగనుండగా.. దానికి సంబంధించిన సేవా టికెట్లను జనవరి 22 ఉదయం 10గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. 

Tags:    

Similar News