ChandrababuArrest : టైం బాగోలేకపోతే ఇలాంటివే జరుగుతాయి..చంద్రబాబు అరెస్టుపై సుమన్ కీలక వ్యాఖ్యలు

Byline :  Aruna
Update: 2023-09-25 11:00 GMT

స్కిల్ డెవలప్‎మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‎ అయిన విషయం తెలిసిందే. తాజాగా బాబు అరెస్టుపై సినీనటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఇదొక గుణపాఠం అని సుమన్ అన్నారు. ఫిలిం ఛాంబర్‎లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సుమన్ మాట్లాడుతూ.." ఓ మాజీ సీఎంను అరెస్టు చేస్తున్నారంటే పూర్తిగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కావాలనే చంద్రబాబు జైలుకు పంపించారంటే ఎలా? అందులో ఎలాంటి నిజం లేదు. బాబు అరెస్టుకు అనేక కారణాలు ఉన్నాయి. టైం బాగోలేకపోతే ఇలాంటివే జరుగుతాయి. చంద్రబాబు పుట్టినరోజు వివరాలు సరిగా చూసి చెప్పే ఓ జ్యోతిష్యుడు ఉంటే ఆయన ఎప్పుడు జైలు నుంచి వస్తాడో కరెక్టుగా తెలుస్తుంది. సమయం అనుకూలంగా ఉంటే లోకల్ కోర్టులో కూడా అన్నీ అనుకూలంగానే ఉంటాయి. అందుకే చంద్రబాబుకు అనుకూలమైన టైం వచ్చే వరకు ఆయన జైలులోనే ఉండాల్సి వస్తుంది"అని సుమన్ అన్నారు.




Tags:    

Similar News