ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావాల్సిన విమానం సముద్రంలో ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగా.. విమానం నీటిలో మునిగిపోయింది. ఇది ఫ్రాన్స్ లోని.. ఫ్రెజుస్ సముద్రతీరం వద్ద జరిగింది. టూరిస్టుల విమానం గాల్లో ఉండగా విమానం ఇంజిన్ ఫెయిల్ అయ్యింది. దీన్ని గుర్తించిన పైలట్ బీచ్ లో విమానం ల్యాండింగ్ చేయాలనుకున్నారు.
బీచ్ వద్ద జనాల రద్దీని గమనించిన పైలట్.. వారికి ఇబ్బందులు కలుగుతాయని భావించాడు. అయితే చాకచక్యంగా వ్యవహరించి.. బీచ్ కు దగ్గరగా సముద్రంలో విమానాన్ని ల్యాండింగ్ చేశాడు. బీచ్ కు 600 మీటర్ల విమానం ల్యాండ్ అవ్వగా.. రెస్క్యూ సిబ్బంది విమానంలోని ముగ్గురిని కాపాడారు. అయితే విమానం మాత్రం నీటిలో మునిగిపోయింది. పైలట్ సమయస్ఫూర్తిగా వ్యహరించడంతోనే పెద్దప్రమాదం తప్పిందని.. అధికారులు తెలిపారు.