బాపట్లలో దారుణం..టెన్త్‌ విద్యార్థిపై పెట్రోల్‌ పోసి నిప్పు

Update: 2023-06-16 06:16 GMT

బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో దారుణం జరిగింది. రాజోలులో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్‌పై స్నేహితుడే పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఉదయం ట్యూషన్‌కు వెళ్లొస్తుండగా బాలుడి స్నేహితుడు వెంకటేశ్వరరెడ్డి మరికొందరితో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అమర్నాథ్‌ను గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.

ఉప్పలవారిపాలెంకి చెందిన ఉప్పల అమర్నాథ్‌ స్థానిక ఉన్నత పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. రోజూ ఉదయం రాజోలుకు ట్యూషన్‌కి వెళ్తాడు. ఎప్పటిలాగే ఇవాళ ఉదయం వెళుతుండగా మార్గంమధ్యలో అతడి స్నేహితుడు వెంకటేశ్వరరెడ్డి మరి కొందరితో కలిసి అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. స్థానికులు వెంటనే మంటలు ఆర్పి అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అమర్నాథ్‌ మృతి చెందాడు. తనపై వెంకటేశ్వర్‌రెడ్డి, మరికొందరు పెట్రోల్‌ పోసి నిప్పంటించారని మృతికి ముందు పోలీసులకు అమర్నాథ్‌ వాంగ్మూలం ఇచ్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Tags:    

Similar News