నెల్లూరులో విషాదం.. ఆస్పత్రిలో ఆరుగురు చిన్నారులు మృతి..!

Update: 2023-07-22 10:11 GMT

ఏపీలోని నెల్లూరులో తీవ్ర విషాదం నెలకొంది. నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో ఒకే రోజు ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. ఆక్సిజన్ అందక చిన్నారులు మృతి చెందారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆక్సిజన్ సరాఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. చిన్నారుల ఎలా మృతి చెందారనే అంశంపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతామన్నారు. చిన్నారుల మృతితో బాధిత కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయారని ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News