టమాటాలు పండించడమే అతనికి శాపంగా మారిందా.. టమాటాల ధరలే అతడి ప్రాణం తీశాయా..అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలోని మదనపల్లి మండంలో జరిగిన రైతు హత్య పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లా మదనపల్లె మండలం బోడుమల్లదిన్నెకు చెందిన టమోటా వ్యాపారి రాజశేఖర్ దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు రాజశేఖర్ చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా చంపేశారు. పశువుల కాపర్లు ఇచ్చిన సమచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు.
రాజారెడ్డికి గ్రామంలో 20 ఎకరాల భూమి ఉంది. అందులో నాలుగు ఎకరాల్లో టమాటను పండిస్తున్నాడు. ఈ నేపధ్యంలో రాజారెడ్డి తన పొలంలో పండిన పంటను ప్రతిరోజు మదనపల్లి మార్కెట్‌కు తరలించి విక్రయించి వస్తున్నాడు. ఇటీవల టమాట ధర విఫరీతంగా పెరిగిపోవడంతో అతడికి భారీ లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. అతని వద్ద బాగా డబ్బు ఉందనే అనుమానంతో దుండగులు హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రైతు ప్రాణం తీసిన టమాటా ధరలు
— Telugu Scribe (@TeluguScribe) July 12, 2023
మదనపల్లి - బోడిమల్లదిన్న గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి టమాటా పంట పండించి మార్కెట్లో అమ్ముతూ ఉంటాడు. టమాటా రేటు భారీగా పెరగడంతో గత 20 రోజుల్లోనే 30 లక్షల రూపాయల రాబడి వచ్చింది. డబ్బు కోసం ఆయనని హత్య చేయాలని కొందరు వ్యక్తుల కన్ను ఆయన మీద పడింది.… pic.twitter.com/MaDUQXJ6lV
రాజారెడ్డి మృతదేహం వద్ద టమాటాలు అమ్మగా రావాల్సిన 30 లక్షల బిల్లులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. సెల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు.