ఒకేసారి ఇద్దరు యువకులను ప్రేమించింది..వారికి తెలియకుండా మరొకరిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. పోనీ పెళ్లి చేసుకున్న ఇంట్లో అయినా సుఖంగా ఉందా అదీ లేదు..ఆ అమ్మాయి సాగించిన ప్రేమాట కాస్త ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసింది. అత్తింట్లో అమ్మాయి ప్రేమ వ్యవహారం తెలియడంతో ఆమె జీవితం విషాదంగా ముగిసింది. యువతి ఘనకార్యం తెలుసుకున్న విశాఖ వాసులు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఓ యువతి ట్రయాంగిల్ ప్రేమకథ విశాఖపట్నంలో తీవ్ర కలకలం రేపింది. గోపాలపట్నానికి చెందిన ఓ అమ్మాయి ఒకేసారి ఇద్దరు యువకులతో ఆడిన ప్రేమాట కాస్త బెడిసికొట్టింది. ప్రేమించిన ఇద్దరు యువకులను పెళ్లి చేసుకోకుండా వారిద్దరినీ కాదని మరోకరిని రహస్యంగా పెళ్లాడి మరో ట్విస్ట్ ఇచ్చింది. పోనీ పెళ్లి తరువాత కామ్ గా ఉందా అంటే అదీ లేదు. వివాహం తర్వాత కూడా ఆమె ధోరణి మారలేదు. ప్రేమించిన అబ్బాయిలతో పెళ్లి తరువాత కూడా టచ్‌లో ఉంటూ వచ్చింది. వారితో చాలా చనువుగా ఉంది. విషయం తెలుసుకున్న భర్త యువతిని నిలదీశాడు. ఇదే సమయంలో ఆ అమ్మాయి ఇద్దరు ప్రేమికుల్లో ఒకడు ఏకంగా యువతి అత్తారింటికి వచ్చి నేను కావాలో భర్త కావాలో తేల్చుకోవాలంటూ పెద్ద పంచాయితీనే పెట్టాడు. దీంతో ఈ యువతి ఘనకార్యం కాస్త బట్టబయలైంది.
అత్తగారింట్లో తన ప్రేమాయణం తెలిసిపోవడంతో యువతి బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఆమె జీవితం విషాదంగా ముగిసింది. ఇదిలా ఉంటే..ప్రేయసి చనిపోయిందన్న బాధతో ఆమె ప్రేమికుడు రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు విశాఖలో ఈ న్యూస్ పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. యువతి రాసిన సూసైడ్ లెటర్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను లోతుగా పరిశీలిస్తున్నారు.