క్రిస్టియన్ అని ఆరోపణలు.. టీటీడీ చైర్మన్ ఏమన్నారంటే..?

Update: 2023-08-27 09:08 GMT

టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నియామకంపై కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. ఆయన క్రిస్టియన్ అని అటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా ఎలా నియమిస్తారని బీజేపీ, టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఆయన్ని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు క్రిస్టియన్ అయిన భూమన కరుణాకర్ రెడ్డిని టిటిడి చైర్మన్‌గా నియమించారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై భూమన సీరియస్ అయ్యారు.

తనపై వస్తున్న విమర్శలపై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా స్పందిచారు. తాను విమర్శలకు భయపడేవాడిని కాదని చెప్పారు.17 ఏళ్ల క్రితమే టీటీడీ చైర్మన్‌గా పని చేసినట్లు గుర్తు చేశారు. ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయటం ఆపేవాడిని కాదని స్పష్టం చేశారు. పోరాటాల నుంచి పైకి వచ్చిన వ్యక్తినని చెప్పారు. నడకదారి భక్తులకు దివ్యదర్శనం కల్పించేలా టోకెన్ సిస్టమ్ ప్రారంభించింది తానేనని చెప్పారు.

‘‘17 ఏళ్ల క్రితమే నేను టీటీడీ ఛైర్మన్‌ అయ్యాన. 30వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించాను. తిరుమల ఆలయ మాడవీధుల్లో చెప్పులతో వెళ్ల కూడదనే రూల్ తీసుకొచ్చింది నేనే. అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు జరిపించాను. దళితవాడల్లో శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం చేయించాను. నేను క్రిస్టియన్‌ అని, నాస్తికుడని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే నా సమాధానం’’ అని అన్నారు.

Tags:    

Similar News